HomeYellanduగ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: సర్పంచ్ రమేష్ బాబు

గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: సర్పంచ్ రమేష్ బాబు

📰 Generate e-Paper Clip

♦ కలెక్టర్, MPDO ఆదేశాలతో ప్రకృతి వనం శుభ్రత: సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు

♦ విజయలక్ష్మి నగర్ పల్లె ప్రకృతి వనంలో పిచ్చి మొక్కల తొలగింపు

గౌరవ జిల్లా కలెక్టర్ మరియు ఎంపీడీవో (MPDO) ఆదేశానుసారంగా విజయలక్ష్మి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రకృతి వనంలో విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు, పిచ్చి పొదలను కార్మికులతో కలిసి పూర్తిగా తొలగించి, వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు మాట్లాడుతూ.. పల్లె ప్రకృతి వనాల సంరక్షణ మన అందరి బాధ్యత అని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాన్ని పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య లోపం లేకుండా చూసేందుకు ఇటువంటి పనులు నిరంతరం కొనసాగుతాయన్నారు. ఈ పారిశుధ్య కార్యక్రమంలో వార్డు సభ్యులు భద్రు, వసంతతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular