హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 23, (జన సంఘర్షణ):
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను పరోరక్షించాలని కోరుతు నేడు నిర్వహించిన సంతకాల సేకరణ కు ప్రజల నుండీ మంచి మద్దత్తు రావడమే కాకుండా పూర్తీ సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్నిఅఖిల పక్షాల నాయకులూ సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, జనసేన నాయకులు సతీష్ బీజేపీ మాధవులునిర్వహించారు అతిథులుగా ఆకుల సతీష్ నల్ల జయశంకర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ దేవాలయ భూమి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేడు ప్రజల మద్దతు కోసం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించగా ప్రజల నుండే కాకుండా వివిధ ఇతర రాజకీయ పార్టీల,బస్తి నాయకుల మద్దతు పెద్ద ఎత్తున వచ్చిందని అన్నారు. అధికారంలో ఉన్న పాలకులు,అధికారం అనుభవించిన వాళ్ళు ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకోక పోవడం దారుణమని,హై కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్థానిక రెవిన్యూ అధికారులు పట్టించుకోక పోవడం,పిర్యాదు చేసిన అలసత్వం వహించడం వల్ల ఉన్న భూమి కూడా అన్యాక్రాంతం అవుతుందని ఇప్పటికైనా అధికారులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం భూములను సర్వే చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేంతవరకు కొనసాగుతుందని అన్నారు. కావున రెవెన్యూ అధికారులు వెంటనే హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో చేసే ఉద్యమంలో కలిసి రావాలని దేవాలయ భూములతో పాటు ప్రభుత్వం భూములు కూడా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు.ఈ కార్యక్రమానికి మద్దతుగా బిఆర్ఎస్ అధ్యక్షులు రుద్రా అశోక్,ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు,మాజీ గుడి చైర్మన్ పిల్లి ఆంజనేయులు, ఆకుల సతీష్ అండ్ టీం ఆకుల సతీష్,జైశంకర్,యెర్ర యాకన్నా, ఎర్ర వీరన్న,ముకేశ్,వంశీ లతో పాటు వందలాది మంది మద్దతుగా సంతకాలు చేసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.


