హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 23, (జన సంఘర్షణ):
ముషీరాబాద్ దోమలగూడ లోయర్ ట్యాంక్ బండ్ పరిధిలో వకీల్ సాబ్ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలను అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. నిత్యం న్యాయం కోసం పోరాడుతూ, బాధితులకు అండగా నిలుస్తూ తన వృత్తి పట్ల నిబద్ధతతో ముందుకు సాగుతున్న చంద్రశేఖర్ సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. న్యాయం కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో సీనియర్ కౌన్సిల్ ఏం ఎల్ శ్రీధర్, కౌన్సిల్ పవన్ అంబేద్కర్, అడ్వకేట్ బిరాదర్ శరత్ కుమార్, బాలస్నేహితులు స్వామి, ఉదయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


