
-ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం.. గురువుల సేవలకు గౌరవం.
భిర్కూర్, /సెప్టెంబర్ 5/ (జన సంఘర్షణ)
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ భిర్కూర్ ఆధ్వర్యంలో మండలంలోని ఆరుగురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. లయన్స్ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారికి సత్కారం అందించారు.
ఈ సందర్భంగా సన్మానం పొందిన ఉపాధ్యాయులు:
1- విద్యాసాగర్ – సహాయక ఉపాధ్యాయుడు, తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భిర్కూర్!!*
2- ఎం. సత్యనారాయణ – సహాయక ఉపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బారంగెడిగి.
3- ఎన్. లావారెడ్డి – సహాయక ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల, ధమరంచ
4- ఎస్. అరవింద్ కుమార్ – జూనియర్ కళాశాల అధ్యాపకుడు, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల, భిర్కూర్
5- బి.ఎన్. సింధూర – ఆంగ్ల ఉపాధ్యాయురాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల, భిర్కూర్
6- రేష్మా బేగం – సహాయక ఉపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉర్దూ మాధ్యమ ఉన్నత పాఠశాల, భిర్కూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితానికి దిశానిర్దేశం చేసే గురువుల స్థానం సమాజంలో అత్యున్నతమైనదని అన్నారు. విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సంస్కారం, మానవీయ విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోపిచంద్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేత్రి కిరణ్, కార్యదర్శి గాండ్ల సాయికృష్ణ, జోన్ చైర్మన్ శీతలే రమేష్, సీనియర్ లయన్స్ సభ్యులు వీరయ్య, కొట్టూరి సంతోష్, మేరు భరత్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


