— జిల్లా ఎస్పీ.డి. వి. శ్రీనివాసరావు.
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 5 (జన సంఘర్షణ) : మెదక్ జిల్లా శంకరంపేట(ఆర్) మండలంలోని సూరారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పేకాట ఆడుతున్న రణబోయిన విఠల్, ఉప్పరి గంగాధర్, బక్కన్న నర్సింలు, ఆమ్దా నాగరాజు, యాట దర్శన్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.10,380 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట స్థావరాల నిర్వహణపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇటువంటి కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.


