Homeఎడిటోరియల్యూరియా బుకింగ్ యాప్ లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలి.

యూరియా బుకింగ్ యాప్ లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలి.

📰 Generate e-Paper Clip

వేగంగా పంట నమోదు చేయాలి.

–జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 5 (జన సంఘర్షణ):

వేగంగా పంట నమోదు చేయాలనీ,యూరియా బుకింగ్ యాప్ లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలో వేగంగా పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న వాలంటీర్ ద్వారా మాత్రమే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు.రైతుల నమోదు జిల్లా లో 75 శాతం పూర్తి అయిందన్నారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో యూరియా బుకింగ్ యాప్ లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులకు సరైన సమయానికి ఎరువులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్,వినయ్,వందన ,వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular