Homeతెలంగాణనిజామాబాద్మంజీర నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా !

మంజీర నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా !

📰 Generate e-Paper Clip

 

 

తగ్గేల్లి, మందర్నా ప్రాంతాల నుంచి బోధన్‌కు తరలింపు.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు

సాలూరా/, సెప్టెంబర్ 15 /(జనసంఘర్షణ): మంజీర నదిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని సాలూరా ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. తగ్గేపల్లి, మందర్నా ప్రాంతాల్లో మంజీర నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రతిరోజూ సాలూరా క్యాంప్ మీదుగా బోధన్‌కు తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అక్రమ ఇసుక రవాణాపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ రూరల్ పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణాకు ఎవరి అండదండలు ఉన్నాయనే విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను స్థానికులు కోరుతున్నారప్రాణాలకు ముప్పుగా ఇసుక వాహన

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు వేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో రహదారులపై ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణా వాహనాల కారణంగా ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని వారు ఆవేదనవ్యక్తం చేస్తున్

ఇకనైనా మేల్కొనాలి.. లేదంటే ప్రజలే ప్రశ్నిస్తారు

మంజీర నదిని ఇసుక మాఫియా బారినుంచి కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇకనైనా రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తూ అక్రమ రవాణాను అడ్డుకోకపోతే భవిష్యత్‌లో జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారో అధికారులు సమాధానం చెప్పాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మంజీర నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular