Homeతెలంగాణనిజామాబాద్రక్తదానం చేసి మానవత్వం చాటిన సేవకులు

రక్తదానం చేసి మానవత్వం చాటిన సేవకులు

📰 Generate e-Paper Clip

 

ఆపదలో ఉన్న వృద్ధురాలికి అండగా నిలిచిన రమేష్‌.. ఇద్దరు రక్తదాతల ద్వారా రక్తం అందజేత

 

  • కోటగిరి, సెప్టెంబర్ 16 (జనసంఘర్షణ): కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రుక్మిణి గౌడ్ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని బసవతారకం ఆసుపత్రిలో ఆపరేషన్‌ నిమిత్తం బీ పాజిటివ్‌ రక్తం అవసరమైంది. ఈ విషయాన్నకుటుంబ సభ్యులు సేవకుడు సీతల రమేష్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి రక్తదాతలను సమకూర్చారు.

రమేష్‌ సర్‌ చొరవతో బీర్కూర్‌ మండలం చించోలి గ్రామానికి చెందిన వెంకటేష్ శర్మ, పోతంగల్‌ మండలం హంగర్గ గ్రామానికి చెందిన రాకేష్ పటేల్ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆపద సమయంలో స్పందించి రక్తం అందించడంతో రుక్మిణి గౌడ్‌ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అత్యవసర సమయంలో రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రక్తదాతలుగా ముందుకు వచ్చిన వెంకటేష్ శర్మ, రాకేష్ పటేల్‌తో పాటు రక్తదాతలను సమకూర్చిన సేవకుడు సీతల రమేష్‌కు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రక్తదాతలు:

వెంకటేష్ శర్మ – చించోలి, బీర్కూర్ మండలం

రాకేష్ పటేల్ – హంగర్గ, పోతంగల్ మండలం

సేవకుడు: సీతల రమేష్

సాయాగౌడ్, కొత్తపల్లి (కోటగిరి) ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular