తెలంగాణలోని మాదిగ జర్నలిస్టుల ఐక్యత సంక్షేమంతో పాటు వృత్తిపరమైన అభివృద్ధి కోసం కృషి చేస్త ” బోల్లెపాక రాజేష్ ”
ధర్మసాగర్ , సెప్టెంబర్ 20 ( జన సంఘర్షణ )
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక సంపాదకులు బొల్లెపాక రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఫోరమ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల నాగేందర్ తెలిపారు.
ఆదివారం హైదరాబాద్‌లోని బీసీసీఈ భవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బొల్లెపాక రాజేష్ మాట్లాడుతూ తెలంగాణలోని మాదిగ జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. జర్నలిస్టుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఫోరమ్‌ను బలోపేతం చేస్తానని తెలిపారు.
యువ జర్నలిస్టులకు మార్గదర్శకత్వం, వృత్తిపరమైన శిక్షణ అందించడంతో పాటు, మహిళా జర్నలిస్టుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఫోరమ్‌ను వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా మాదిగ జర్నలిస్టుల సమష్టి ప్రయోజనాల కోసం పనిచేసే బలమైన వేదికగా తీర్చిదిద్దేందుకు నూతన కార్యవర్గంతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందించి, కష్టకాలంలో సభ్యులకు అండగా నిలిచే విధంగా ఫోరమ్‌ను ముందుకు తీసుకెళ్తామని రాజేష్ తెలిపారు.


