Homeఎడిటోరియల్ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఇవే..

ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఇవే..

📰 Generate e-Paper Clip

ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఇవే..

హైదరాబాద్ / నెంబర్ 21 ( జన సంఘర్షణ )

తెలంగాణలో మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దసరాతో పాటు బతుకమ్మ కూడా వస్తుండటంతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు చివరి వర్కింగ్ డే అక్టోబర్ 9. ఆ తర్వాత సెలవుల అనంతరం అక్టోబర్ 23వ తేదీనుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుకుంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. తప్పనిసరిగా అన్ని సంస్థలు వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఇక ఏపీ విషయానికొస్తే.. 10 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు వచ్చాయి. 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి దసరా పండుగ సెలవులు మొదలవుతాయి. అక్టోబర్ 21 వరకు మొత్తం 10 రోజుల పాటు సెలవులు కొనసాగుతాయి. ఏపీ, తెలంగాణలో సెలవులు భిన్నంగా ఉన్నాయి. అయితే క్రైస్తవ, మైనార్టీ విద్యాసంస్థలకు సంబంధించి సెలవులు భిన్నంగా ఉంటాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular