Homeఎడిటోరియల్బాసర బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

బాసర బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ. సెప్టెంబర్ 23. ( జన సంఘర్షణ )

వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చేపట్టిన భద్రతా చర్యల్లో భాగంగా బాసర బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా నిమజ్జనం కోసం వచ్చే గణేష్ విగ్రహాల రాకపోకలు, వాహనాల నియంత్రణ , భక్తుల భద్రత , ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేలా అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

అలాగే బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, నిమజ్జనానికి వచ్చే భక్తులు మరియు గణేష్ విగ్రహాల నిర్వాహకులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.ప్జల భద్రతే ప్రధాన లక్ష్యంగా, గణేష్ నిమజ్జన వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కృషి చేస్తుందని అన్నారు.

ఈ సందర్బంగా నిజామాబాదు ఎ.సి.పి. ప్రకాష్ , నార్త్ రూరల్ సి.ఐ శ్రీనివాస్ , నవీపేట్ ఎస్. ఐ శ్రీకాంత్ , ఎ. ఎస్. ఐ సుధర్శన్ మరియు సిబ్బంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular