Homeబోధన్రుద్రూర్‌లో ఘనంగా లయన్ ఇందూర్ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు - లయన్స్ ఆసుపత్రిలో అన్నప్రసాద వితరణ

రుద్రూర్‌లో ఘనంగా లయన్ ఇందూర్ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు – లయన్స్ ఆసుపత్రిలో అన్నప్రసాద వితరణ

📰 Generate e-Paper Clip

రుద్రూర్: అక్టోబర్26( జన సంఘర్షణ )

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం

రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వ్యవస్థాపక సభ్యులు లయన్ ఇందూర్ చంద్రశేఖర్ పుట్టినరోజును పురస్కరించుకొని బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.

ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్న రోగులకు, వారి సహాయకులకు మరియు రోజువారీ ఓపీకి వచ్చిన రోగులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. పుట్టినరోజు జరుపుకుంటున్న లయన్ ఇందూర్ చంద్రశేఖర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా పేద రోగులకు కడుపు నింపే ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో విలువైనదని, సంతోషకరమైన విషయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జి.ఎస్.టి కోఆర్డినేటర్ లయన్ శ్యాంసుందర్ పహాడే, జిల్లా చైర్మన్ లయన్ కె.వి. మోహన్, క్లబ్ కోశాధికారి లయన్ పార్వతీ ప్రశాంత్, డైరెక్టర్ లయన్ పుట్టి సాగర్, దుర్గాదేవి కమిటీ అధ్యక్షులు ఇందూర్ కార్తీక్, రుద్రూర్ గ్రామ వార్డు సభ్యులు ఆమంద్ వెంకటేశ్వర్, పాత్రికేయులు బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular