Homeతెలంగాణబోధన్‌లో కలకలం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన వడ్ల లోడ్ లారీ!

బోధన్‌లో కలకలం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన వడ్ల లోడ్ లారీ!

📰 Generate e-Paper Clip

*బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన లారీ.. రెండు బైకులు ధ్వంసం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!!*
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/ నవంబర్ 7 (జన సంఘర్షణ):

బోధన్ పట్టణంలోని బైపాస్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

*స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….!* వడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోధన్ బైపాస్ వద్దకు చేరుకోగానే బ్రేకులు పనిచేయకపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ వేగంగా వెళ్లి పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది.

*అయితే ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో ..!!**ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ ఢీకొనడంతో అక్కడ ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

*తృటిలో తప్పిన ప్రాణనష్టం….!!*

లారీ హోటల్‌లోకి దూసుకెళ్లిన ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊరట చెందారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular