Homeతెలంగాణనిజామాబాద్నేడు హోలీ వేళ వింత ఆచారం .

నేడు హోలీ వేళ వింత ఆచారం .

📰 Generate e-Paper Clip

 

హోలీ పండగ వేళ ఆ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది.హోలీ పండగ వేళ ఆ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. పండగపూట గ్రామస్తులంతా చేరి గుడివద్ద పిడిగుద్దులు గుద్దుకుంటారు కాస్త వింతగా ఉన్న ఈ ఆచారం తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో సాలుర మండలంలో హుంస్సా అనే గ్రామంలో జరుగుతుంది. ప్రతియేటా హోలీ పండగను పురస్కరించుకొని గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద పిడిగుద్దులు గుద్దుకునే వింత ఆచారాన్ని దశాబ్దాల కాలం నుంచి జరుపుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ వింత ఆచారం కాస్త తీవ్ర ఘర్షణలకు దారి తీస్తుండటంతో ఈసారి మాత్రం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గ్రామస్తులు ప్రత్యేక వినతి చేయడంతోఎట్టకేలకు పోలీసులు 5 నిముషాలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ హూంస్సా గ్రామస్తులు గురువారం ఈ ఆచారాన్ని పూర్తి చేశారు. ఈ సమరంలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలు పిడిగుద్దుల ఆచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular