Homeతెలంగాణనిజామాబాద్సేవ్ లైవ్ ఫౌండేషన్ వారు 10 బ్రీత్ ఎనలైజర్స్ పంపిణి

సేవ్ లైవ్ ఫౌండేషన్ వారు 10 బ్రీత్ ఎనలైజర్స్ పంపిణి

📰 Generate e-Paper Clip

జాతీయ రోడ్డు 44 పై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సేవ్ లైవ్ ఫౌండేషన్ వారు 10 బ్రీత్ ఎనలైజర్స్ పంపిణి : పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ సిటీ. మార్చ్ 17 . ( జన సంఘర్షణ )

నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 పై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, వెర్టీస్ ఫౌండేషన్ సహకారంతో , ఢిల్లీకి చెందిన సేవ్ లైవ్ ఫౌండేషన్ ( సేవ్ లైఫ్ ఫౌండేషన్ ) సహాయంతో నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, 10 బ్రీత్ ఎనలైజర్స్ అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు రహదారి భద్రతను పటిష్టం చేయడం జరుగుతుంది అని , జాతీయ రహదారి 44 లో  హైదరాబాద్-నిజామాబాద్ మధ్య గల NH-44 రహదారిపై ప్రమాదాల నివారణకు ఈ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది అన్నారు. ఇట్టి బ్రీత్ ఎనలైజర్స్ ద్వారా వాహనాదారును తనిఖీలు నిర్వహించడం వలన రోడ్డు ప్రమాదాల సంఖ్యను నివారించవచ్చని మరియు రహదారులపై మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి. బస్వారెడ్డి , సేవ్ లైఫ్ ఫౌండేషన్ అసిస్టెంట్ మేనేజర్ నూర్ కేతర్పాల్ , ఈ-డార్ మేనేజర్ వర్ష , ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ , ట్రాఫిక్ సిఐ శ్రీ ప్రసాద్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ విభాగం వినోద్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular