కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలాభిషేకాలు, జలాభిషేకాలు, జేసీబీలతో దండలు వేయడంపై టీపీసీసీ నిషేధం
ఎఐసిసి తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు…
టీపీసీసీ ఉపాధ్యక్షుడు టి. కుమార్ రావు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలోనూ పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహించరాదని ఆదేశించారు. ఆహార వృథాకు దారితీసే ఈ పద్ధతులకు బదులుగా అవసరమైన వారికి ఆహార పంపిణీ చేపట్టాలని సూచించారు. అలాగే జేసీబీలు, బుల్డోజర్లు వంటి భారీ యంత్రాలతో నేతలకు భారీ దండలు వేయడం కూడా నిషేధిస్తూ, ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.


