HomeYellanduపట్టణ అధ్యక్షుడు బోళ్ళ సూర్యం సమక్షంలో 15వ వార్డు కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

పట్టణ అధ్యక్షుడు బోళ్ళ సూర్యం సమక్షంలో 15వ వార్డు కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

♣ కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి పిలుపు

♣ సీనియర్ నాయకుడు సుదర్శన్ కోరి నేతృత్వంలో సాగిన కాంగ్రెస్ వార్డు సమావేశం

♣ సుదర్శన్ కోరి చొరవతో 15వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంతోష్ పాసి ఎంపిక

 

ఇల్లందు పట్టణంలోని 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సంతోష్ పాసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15వ వార్డు కౌన్సిలర్ సోనీ భాయ్ సుదర్శన్ కోరి అధ్యక్షతన నిర్వహించిన వార్డు కార్యవర్గ ముఖ్య సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా వార్డు నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు.

ఈ నూతన కార్యవర్గ ప్రకటన మరియు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బోళ్ళ సూర్యం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు ఐక్యమత్యంతో పనిచేయాలని, ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.

అలాగే ఈ సమావేశంలో ప్రత్యేకంగా పాల్గొన్న 22వ వార్డు కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్ మాట్లాడుతూ.. వార్డు కమిటీల ఏర్పాటుతో పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమాన్ని ముందంజ ఉండి నడిపించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదర్శన్ కోరి నూతన కమిటీ సభ్యులను అభినందించారు. వార్డు సెక్రటరీగా కిరణ్ కుమార్ పాసి, మహిళా అధ్యక్షురాలిగా అనిత పాసి, అలాగే మహిళా సెక్రటరీగా లక్ష్మిలను ఎన్నుకున్నట్లు ఆయన సగర్వంగా ప్రకటించారు.

ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ వార్డు స్థాయి సమావేశంలో 20వ వార్డు కౌన్సిలర్ జాఫర్, కో-ఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తిలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో వార్డు కార్యకర్తలు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular