Homeభద్రాచలంSIR ప్రక్రియను వేగవంతం చేయాలి: కన్వీనర్ కుంజా సంతోష్, కుంజా ధర్మాతో బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

SIR ప్రక్రియను వేగవంతం చేయాలి: కన్వీనర్ కుంజా సంతోష్, కుంజా ధర్మాతో బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

♦ భద్రాచలంలో ‘SIR’ అభియాన్: బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి పర్యటన

♦ భద్రాచలం బూత్ స్థాయి అధికారులతో బీజేపీ బృందం భేటీ: నమోదు ప్రక్రియపై రివ్యూ

♦ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మార్వోతో భేటీ అయిన బీజేపీ నేతలు కుంజా సంతోష్, బైరెడ్డి

♦ భద్రాచలంలో బీజేపీ 24 గంటల ప్రవాస్ అభియాన్ సక్సెస్

తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భద్రాచలంలో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అభియాన్‌లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి భద్రాచలం మండలంలో 24 గంటల విస్తృత పర్యటన నిర్వహించారు.

ఈ పర్యటనను బీజేపీ భద్రాచలం SIR కన్వీనర్ కుంజా సంతోష్ మరియు ముఖ్య నాయకులు కుంజా ధర్మా ల నేతృత్వంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడితో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనలో వారు చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి SIR కార్యక్రమ అమలు తీరును జిల్లా అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను, నమోదు ప్రక్రియ తీరును ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.

SIR నమోదును మరింత వేగవంతం చేయడం మరియు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా నాయకులకు, కార్యకర్తలకు జిల్లా అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు.

దీనిలో భాగంగా భద్రాచలం పట్టణంలోని 145, 148, 160, 161, 165, 167, 172, 173, 174 పోలింగ్ బూత్‌లను పర్యవేక్షణ బృందం సందర్శించింది. ఆయా బూత్‌ల బూత్ లెవల్ అధికారులను (BLOలు) నేరుగా కలిసి, నమోదు పురోగతికి సంబంధించిన వివరాలను సేకరించారు.

ఇప్పటివరకు జరిగిన SIR నమోదు పురోగతి, నమోదైన శాతం, క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎదురైన సమస్యలు మరియు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన అవసరమైన చర్యల గురించి అధికారులు, సిబ్బందితో సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో భద్రాచలం ఎమ్మార్వో  వై. రవికుమార్ ని కలిసి, భద్రాచలం మండలంలోని SIR కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర నివేదికను పరిశీలించి, నమోదు ప్రక్రియ వేగవంతం చేయడంపై చర్చలు జరిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ భద్రాచలం SIR కన్వీనర్ కుంజా సంతోష్, ముఖ్య నాయకులు కుంజా ధర్మా లతో పాటు బీజేపీ నాయకులు ములిశెట్టి రాంమోహన్ రావు, నిడదవోలు నాగబాబు, ఆవుల సుబ్బారావు, బోడ సత్యనారాయణ, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ట్రిపుల్ ఎక్స్ చక్రవర్తి, పీసీ కేశవ్, ములిశెట్టి నిఖిల్, అన్నెం హరీష్, అన్నెం సాయి లక్ష్మణ్, జీవా, రామాచారి, షేర్ శ్రీను, పానీపూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular