Homeఎడిటోరియల్క‌వుల‌కు ధ‌న్యవాదాలు: అంజిబాబు ఫౌండేష‌న్ సాహిత్య సేవ మ‌రువ‌లేనిది

క‌వుల‌కు ధ‌న్యవాదాలు: అంజిబాబు ఫౌండేష‌న్ సాహిత్య సేవ మ‌రువ‌లేనిది

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, సెప్టెంబర్ 06, (జన సంఘర్షణ):

గురుదక్షిణ క‌వితా సంక‌ల‌నానికి క‌విత‌లు అందించిన క‌వులు అంద‌రికీ సంపాద‌కులు, క‌వి కొండూరి కోటిబాబు , ఎస్ .కళ్యాణ్ దాస్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. అతి త‌క్కువ కాలంలోనే అద్భుత క‌విత‌లు అందించార‌ని కొనియాడారు. వారి స‌హ‌కారంతోనే ఇంత చ‌క్క‌టి పుస్త‌కం ఆవిష్కృత‌మైంద‌ని అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వేదిక‌గా జ‌రిగిన పుస్త‌కావిష్క‌ర‌ణ విజ‌య‌వంతం కావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేశారు.వర్సిటీ విద్యార్థులతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 60 మంది కవులు గురువుల గొప్పదనం చాటుతూ చక్కటి కవితలను ఈ పుస్తకంలో అక్షరీకరించారని అన్నారు. సంపాదకులుగా వ్య‌వ‌హ‌రించిన విద్యార్థుల‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించిన వ‌ర్సిటీ వీసీ నిత్యానంద‌రావుకు, రిజిస్ట్రార్ కోట్ల హ‌నుమంత‌రావుకు, జ‌ర్న‌లిజం విభాగం హెచ్ ఓడీ ప‌ద్మ‌ప్రియ‌, అధ్యాప‌కుల‌కు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సాహిత్య సేవ‌లో భాగంగా పుస్త‌క ప్ర‌చుర‌ణ‌కు ఆర్థిక స‌హ‌కారం అందించిన అంజిబాబు ఫౌండేష‌న్ ఫౌండ‌ర్ మరియు సీఈఓ నాగుల అంజిబాబుకు ప్రత్యేకమైన ధ‌న్య‌వాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular