* సర్వే నంబర్ 170తో పాటు ప్రభుత్వ భూముల సరిహద్దులు, రికార్డులను పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్‌కు వినతి..!
పోతంగల్, సెప్టెంబర్ 21 (జనసంఘర్షణ):
పోతంగల్ గ్రామంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ వైస్ ఎంపీపీ గంగాధర పటేల్‌తో కలిసి యం. నితిన్ పటేల్ సోమవారం ప్రజావాణిలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని ప్రభుత్వ భూముల సరిహద్దులు, రెవెన్యూ రికార్డులు, సర్వే మ్యాప్‌లు, టిప్పన్ మ్యాప్‌లను పరిశీలించి భూములను పరిరక్షించాలని వారు కోరారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. పోతంగల్ గ్రామంలోని పట్టా రెవెన్యూ సర్వే నంబర్ 170/అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ పరిధిలో సుమారు 12 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. ఈ సర్వే నంబర్‌కు సంబంధించిన సరిహద్దులు, రెవెన్యూ నక్షా, టిప్పన్ రెవెన్యూ మ్యాప్‌లను పరిశీలించి, 1953, 1954, 1955 సంవత్సరాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల ఆధారంగా వివరాలను నిర్ధారించాలని కోరారు.
సర్వే నంబర్ 170 చుట్టూ సుమారు 33 అడుగుల రహదారి ఉన్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. 2006–2007 సంవత్సరాల్లో మొరం ఫార్మేషన్ రోడ్డు, ఒకవైపు సీసీ రోడ్డు, డ్రెయిన్, మరోవైపు మొరం ఫార్మేషన్ రోడ్డు, కల్వర్టు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులకు సంబంధించిన పంచాయతీరాజ్, మండల స్థాయి కొలతల పుస్తకాల రికార్డులను పరిశీలించాలని కోరారు.
22-ఏ కింద ప్రభుత్వ భూముల వివరాలు నమోదు చేయాలని వినతిపోతంగల్ గ్రామం, మండల పరిధిలోని ప్రభుత్వ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22-ఏ(1)(బి) ప్రకారం నిషేధిత సర్వే నంబర్ల కింద ఆస్తుల వివరాలను నమోదు చేయాలని వినతిపత్రంలో కోరారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములుగా ఉన్న సర్వే నంబర్లను పరిశీలించి, వాటి సరిహద్దులను గుర్తించి ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని కోరారు. సుమారు ఆరు నెలల క్రితం సంబంధిత ప్రభుత్వ సర్వే నంబర్లను ఏడీ సర్వేయర్, రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేసినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
సర్వే అనంతరం ప్రభుత్వ భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి, రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. ప్రభుత్వ భూముల్లో ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం తొలగించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
*అధికారులకు ప్రతులు!*
వినతిపత్రం ప్రతులను సబ్ కలెక్టర్, ఆర్డీవో బోధన్, తహసీల్దార్ పోతంగల్, ఏడీ సర్వే నిజామాబాద్, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నిజామాబాద్, ఈఈపీఆర్, ఎంపీడీవో పోతంగల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పోతంగల్తో పాటు తెలంగాణ ప్రభుత్వంలోని సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారుపోతంగల్ గ్రామంలోని ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను పూర్తిగా పరిశీలించి, సర్వే నంబర్ల సరిహద్దులను నిర్ధారించి, ఆక్రమణలు ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని యం. నితిన్ పటేల్ కలెక్టర్‌ను కోరారు


