Homeఎడిటోరియల్రేపు భద్రాచలం ITDA వద్ద ఉద్రిక్తత.. భారీ ధర్నాకు తుడుం దెబ్బ పిలుపు

రేపు భద్రాచలం ITDA వద్ద ఉద్రిక్తత.. భారీ ధర్నాకు తుడుం దెబ్బ పిలుపు

📰 Generate e-Paper Clip

ఆదివాసీ హక్కుల కోసం సమరశంఖం.. సెప్టెంబర్ 21న భద్రాచలంలో మహా మార్చ్!

1/70, పెసా చట్టాల అమలుకై పోరుబాట.. ITDA ముట్టడికి ఆదివాసీ సంఘాలు సిద్ధం!

బ్రిడ్జి సెంటర్ నుంచి ITDA వరకు భారీ ర్యాలీ.. తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ‘ఆదివాసీ మార్చ్’!

ఆదివాసీల హక్కుల పరిరక్షణే లక్ష్యం.. రేపటి ధర్నాను జయప్రదం చేయండి: నాయకుల పిలుపు!

భద్రాచలంలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం సెప్టెంబర్ 21న ITDA కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ భద్రాచలం ఆదివాసీ సమితి (BAS), ఆదివాసీ మహిళా చైతన్య శక్తి ఆధ్వర్యంలో సమాయాత్త సమావేశం నిర్వహించారు.

అల్లూరి సీతారామరాజు కాలనీలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయంలో గుడి పెద్దలు తాటి రుక్మిణి, సోడే సావిత్రి, జారే భద్రమ్మ, యాప బుజ్జమ్మలు ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రేపటి ర్యాలీ, ధర్నా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్ర తుడుం దెబ్బ అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో రేపు (సెప్టెంబర్ 21న) భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ నుంచి PO ITDA కార్యాలయం వరకు భారీ ‘ఆదివాసీ మార్చ్’ మరియు ర్యాలీ నిర్వహించనున్నారు.

ర్యాలీ అనంతరం ITDA కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టనున్నట్లు సంఘాల ముఖ్య నాయకులు వెల్లడించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు, భూమి, అటవీ హక్కుల పరిరక్షణ కోసం 1/70 చట్టం, PESA చట్టం, షెడ్యూల్డ్ ఏరియా చట్టాలతో పాటు అటవీ హక్కుల చట్టం-2006ను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కీలకమైన ITDAలను మరింత పటిష్టపరచాలని, ఏజెన్సీ పరిధిలోని ఉద్యోగాలను ITDA ద్వారానే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.

దీంతో పాటు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు మరియు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తగిన నిధులు కేటాయించాలని వారు కోరారు.

ఆదివాసీల హక్కులు, భవిష్యత్తు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కదలాలని, సెప్టెంబర్ 21న జరిగే ఈ ‘ఆదివాసీ మార్చ్’, ధర్నా కార్యక్రమానికి గిరిజన ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular