* డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
• సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దు – మతసామరస్యానికి విఘాతం కలిగించే పోస్టులపై కఠిన చర్యలు తప్పవు సదాశివనగర్ సిఐ వీరయ్య.
సదాశివ్ నగర్ మండల్ / సెప్టెంబర్ 16 ( జన సంఘర్షణ
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో సదాశివనగర్ సీఐ వీరయ్య ఆధ్వర్యంలో పలు విగ్రహ ఊరేగింపు పై పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సదాశివ నగర్ సిఐ వీరయ్య మాట్లాడుతూ డప్పు కళాకారులను గౌరవిస్తూ, వారి కళలను ప్రోత్సహిస్తూ సాంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి
• సదాశివ నగర్ పరిధిలోని ఇప్పటికే 1 డీజేపై కేసులు నమోదు – డీజేలు, సామగ్రి, వాహనాలు స్వాధీనం.గణేష్ నిమజ్జనాలపై ముందస్తు ఏర్పాట్లు.
గణేష్ పండుగ ప్రారంభమై సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని.
డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని సదాశివ నగర్ సిఐ వీరయ్య స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి డీజేలను వినియోగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, ఎక్కడో జరిగిన సంఘటనలను నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సదాశివ నగర్ సిఐ వీరయ్య కోరారు. మతసామరస్యానికి భంగం కలిగించేలా, ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించేలా అబద్ధపు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు, సందేశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఏదైనా అనుమానాస్పద లేదా వివాదాస్పద సమాచారాన్ని గమనించినప్పుడు దానిని ఫార్వర్డ్ చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన మరియు సురక్షిత వాతావరణంలో
ప్రజలు, భక్తులు, ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు సహకరిస్తూ భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ఏవైనా అనుమానాస్పద పరిణామాలు లేదా సమస్యలు కనిపించిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సదాశివనగర్ సిఐ వీరయ్య కోరారు.


