Homeతెలంగాణ11 ఏళ్లుగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

11 ఏళ్లుగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్,సెప్టెంబర్ 15( జన సంఘర్షణ )

MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని న్యూ మార్కెట్ వద్ద భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.*

 

*MDR ఫౌండేషన్ గత 11 ఏళ్లుగా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో ముందుగా నమోదు చేసుకున్న భక్తులకు MDR ఫౌండేషన్ కార్యాలయంలో మరియు స్థానిక ప్రజలకు కూడా విగ్రహాలను అందజేశారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.*

 

*కార్యక్రమానికి సహకరించిన స్థానిక ప్రజలకు, మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించిన భక్తులకు పృథ్వీరాజ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ వినాయక చవితిని సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.*

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular