* భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,వెంకటాపురం మండలం, అక్టోబర్ 21(జనసంఘర్షణ):
విజయదశమి దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓఎస్‌డీ ఆవుల సత్యనారాయణ సతీమణి హేమలత ని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వెంకటాపురం మండలం, సురవీడు గ్రామంలోని సత్యనారాయణ నివాసానికి దసరా రోజున వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సత్యనారాయణ ని శాలువాతో సత్కరించి, శ్రీ సీతారామచంద్రస్వామి వారి జ్ఞాపికను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.


