పర్యవేక్షణ అధికారి పేరు బి.ప్రకాష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నిజామాబాద్. దర్యాప్తు అధికారుల పేర్లు: కె.వినోద్, సి.ఐ డిచ్పల్లి, జి.సందీప్, ఎస్.ఐ ఇందలవాయి పిఎస్.
ఇందల్వాయి. మార్చి14జన సంఘర్షణ
నేరము జరిగిన తేది: 11.03.2026 , రాత్రి 10:30 గం.లకు గౌరారం గ్రామ శివారు, ఇందలవాయి మండలoనిందితుడు ఏ-1 దగ్గి సతీష్ వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, లింగాపూర్ గ్రామానికి చెందినవాడు. అతనికి తన మేనమామ ఇమ్మడి గోపితో గత కొన్నేళ్లుగా కుటుంబ, భూమి మరియు రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇద్దరి మధ్య వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. తన స్నేహితులు కొండ శ్రీధర్, కొండ రవికుమార్, బండోళ్ళ దేవేందర్, అల్లకొండ నర్సయ్య మరియు కోమన్‌పల్లి ప్రశాంత్‌ల విషయాల్లో కూడా తన మేనమామ జోక్యం చేసుకొని వారిని కూడా ఇబ్బంది పెట్టేవాడని, ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి తన మేనమామ గోపిని హతమార్చాలని అనుకున్న సతీష్ ఈ విషయాని తన స్నేహితులతో చెప్పగా దానికి వారు సరేయని గోపిని చంపడానికి అందరూ కలిసి పథకం వేసుకున్నారు. అయితే సతీష్ కొన్ని రోజుల క్రితం లింగాపూర్ గ్రామానికి చెందిన చిన్నరెడ్డి సంతోష్ రెడ్డి దగ్గరకు వెళ్ళి గోపి తనను చంపేస్తా అని బెదిరిస్తున్నాడని, ఒకవేళ నేను గోపి ని చంపకపోతే అతడు నన్ను చంపుతాడని చెప్పి, గోపి ని తన కార్ తో యాక్సిడెంట్ చేసి చంపుతానని మిగతాది ఏదైనా ఉంటె నన్ను చూసుకొమ్మని చెప్పగా అంధుకు సంతోష్ రెడ్డి సరే అనగా. అవకాశం కోసం ఎదురు చేస్తున్న సతీష్ మరియు అతని స్నేహితులకు.
తేదీ 11-03-2026 నాడు రాత్రి సమయంలో గౌరారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇమ్మడి గోపి కారు కనిపించడంతో నిందితులు అక్కడ కాపు కాసి, అనంతరం గోపి తన కారులో గౌరారం నుండి లింగాపూర్ వైపు వస్తుండగా, దగ్గి సతీష్ తన (ఎం జి)హెెక్టర్ కారును (టీఎస్ -08-హెచ్ ఏ -0222) ఎదురుగా నడుపుకొని వెళ్లి గోపి ప్రయాణిస్తున్న బ్రెజ్జా కారును (టీఎస్16 ఈ యు 8591) ఢీకొట్టాడు, ప్రమాదం జరిగిన తరువాత గోపి కారులో నుండి బయటకు వచ్చి పారిపోవడానికి ప్రయత్నించగా నిందితులు అతన్ని అడ్డగించి కత్తులతో దాడి చేయగా గోపి అక్కడికక్కడే మృతి చెందగా గమనించిన నిందితులు అక్కడి నుండి పరారయ్యాడు ఇందలవాయి పోలీస్ స్టేషన్ ఎదురుగా నిజామాబాద్ వైపు వెళ్ళే రహదారిపై పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు కారు లో నిజామాబాద్ వైపు వెల్లుతూ పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా, వెంటనే వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.
తర్వాత నిందితులు చూపించిన ఆధారాల మేరకు హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలు ఉన్న ఒక “కమ్మ కత్తి” , రక్తపు మరకలు అంటిన నిందితుల బట్టలు, నిందితుల సెల్ ఫోన్ లు (7), ఒక స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్, మరియు నిందితులు హత్యా అనంతరం పారిపోయిన కారు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేయడం జరిగినది. అనతరం చట్ట పరంగా నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.


