జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం
బారాసలోకి చేరుతున్న జీవన్ రెడ్డి ఈనెల 25న ముహూర్తం అధిష్టానం సముచిత స్థానం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం
జగిత్యాల మార్చి 18. జనసంఘర్షణ
ఒకటి కాదు రెండు కాదు 40 ఏళ్ల కాలం పాటు జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా జగిత్యాల పట్టణం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో బారాసలోకి చేరుతున్నట్లు సమాచారం ఇవ్వడంతో, జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి, ఎమ్మెల్సీగా విధులు నిర్వహించిన జీవన్ రెడ్డి కి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జీవన్ రెడ్డికి పార్టీలో సమచిత స్థానం ఇవ్వకుండా, రెండేళ్ల క్రితం బారాస నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కు స్థానం కల్పిస్తున్నారని రెండేళ్లుగా అధిష్టానంతో జీవన్ రెడ్డి పోరాడుతూనే ఉన్నారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఈ విషయం తెలియగానే ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లి కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించిన జీవన్ రెడ్డి అనుచరులు. జీవన్ రెడ్డి ఈనెల 25న బారాసోలోకి చేరుతున్నట్లు సమాచారం.


