Homeతెలంగాణకార్పొరేట్ల సంపద పెంపుకు కోట్లాదిమంది కార్మికుల గొంతుకు ఉరిబిగిస్తారా?..

కార్పొరేట్ల సంపద పెంపుకు కోట్లాదిమంది కార్మికుల గొంతుకు ఉరిబిగిస్తారా?..

📰 Generate e-Paper Clip

కార్పొరేట్ల సంపద పెంపుకు కోట్లాదిమంది కార్మికుల గొంతుకు ఉరిబిగిస్తారా?..నాలుగు లేబర్ కోడ్లపై అసెంబ్లీ తీర్మానం చేయాలి  ఐ ఎఫ్ టీ యూ జాతీయ ఉపాధ్యక్షు లు బి.ప్రదీప్, రాష్ట్ర కార్య దర్శి ఎం.శ్రీనివాస్.

హైదరాబాద్ సిటి / మార్చ్ 17 . (జనసంఘర్షణ )

ఏప్రిల్ ఒకటి నుండి దేశం లో నాలుగు లేబర్ కోడ్లను అమలుచేయాలని మోడీ ఆదేశాలు ఇవ్వడం కార్మిక వ్యతిరేకమైనదని,కార్పొరేట్ల సంపద పెంపుకోసం 145 కోట్ల దేశ ప్రజలకు,70 కోట్ల కార్మికులగొంతుకుఉరితాడు బిగించడానికి సిద్ధంకావడం దుర్మార్గమైనదని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమనిరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మాణo చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టియు)జాతీయ ఉపాధ్యక్షు లు బి.ప్రదీప్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.యావత్తు కార్మికవర్గం లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మెలను నిర్వహించి తమ వ్యతిరేకతను తెలియజేసినప్పటికీ మోడీ ప్రభుత్వం కార్మిక ప్రయోజ నాల కన్నా అంబానీ, అదాని లాంటి పిడికెడు మంది కార్పొరేట్ల సంపదల ను కట్టబెట్టటమే లక్ష్యంగా చేసుకొని నాలుగు లేబర్ కోడలను అమలు చేయటానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధ్యక్షురాలు అరుణ అధ్య క్షతన జరిగిన కార్యక్రమం లో బి.ప్రదీప్, ఎం.శ్రీనివాస్ ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ఎన్నో కార్మిక సమ్మె పోరాటాలు,త్యాగాల ద్వారా సాధించూకొని అనుభవిస్తున్న 29కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దుచేసిందని దీని స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గ ప్రయోజనాలకు ఎంత మాత్రం ఉపయోగపడవని,కార్మిక వర్గ మనుగడకు,హక్కులకు సౌకర్యాలకు సమాధి చేసే ఉద్దేశంతోనే లేబర్ కోడ్లు ఉన్నాయని అన్నారు.వలస కాలం నాటి కార్మిక చట్టాలు అయినందున వాటిని రద్దు చేస్తున్నట్లు కార్మిక చట్టాలను నవీనీకరణ చేస్తున్నట్లు మోడీ అనుచరబృందం ప్రచారం చేసుకుంటుందని వాస్తవానికి రద్దుచేసిన 29 కార్మిక చట్టాలలో కేవలం నాలుగే చట్టాలు 1947 ముందు చేయబడినవని మిగిలిన చట్టాలన్నీ 47తర్వాత భారత పార్లమెంటులలో చర్చించబడి చేసిన చట్టాలని వారు గుర్తు చేశారు.లేబర్ కోడ్లో యూనియన్ పెట్టుకొని హక్కును నిర్మూలించేందుకు, కనీస వేతనాలు లేకుండా చేసేందుకు,సమ్మెకు లేకుండా చేసేందుకు,కార్మిక వర్గానికి రక్షణ లేకుండా చేసేందుకు, ఎనిమిది గంటల పనిని 14 గంటలు మార్చేందుకు మహిళలతో అర్ధరాత్రి పనులు చేయించేందుకు,పరిశ్రమల్లో కార్మికుల భద్రత రక్షణ కనీస మాత్రం కూడా అమలు చేయకుండా ఉండేందుకు, కార్మిక శాఖ అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేందుకు లేబర్ కోడ్లు రూపొందించి ఉన్నారని వారు తెలిపారు.

కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు.

బిజెపి యేతర రాష్ట్రాలు తమిళనాడు,కేరళ,పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు తమ రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమని ప్రకటించాయని అసెంబ్లీలలో తీర్మానాలు చేశారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని,నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయవద్దని వారి డిమాండ్ చేశారు. కార్యక్రమoలో హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్జిల్లాల ప్రధాన కార్యదర్శి జి.అనురాధ, పి.శివ బాబు,సత్య నారాయణ,శ్రీశైలం,కుమార్,మణెమ్మ,పద్మ,ఇంద్రన్న,మంగళ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular