బోధన్ పట్టణానికి 5 రోజుల పాటు నీటి సరఫరాల లో అంతరాయం.
సింగూర్ జుక్కల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ సింగూరు 145 ఎమ్,ఎ,డి వాటర్ టాస్ మీటర్ ప్లాంట్ మైంటైనస్, ప్రధాన పైపులైను లీకేజీ మరమ్మతుల నిర్వహణ నిమిత్తం మోటర్స్ నిలిపివేయడం జరిగిందన్నారు. అలాగే బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాలు మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిదిలోని గ్రామాలకు బల్క్ నీటిసరఫరాలో 5 రోజులు అంతరాయం ఏర్పడింది ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 28 నుండి ఏప్రిల్ 02 వరకు నీటి సప్లై అంతరాయం కలుగుతుందన్నారు.
దీనిలో భాగంగా బోధన్ పట్టణంలో 5 రోజుల్లో ప్రతి రోజూ ఒక ట్యాంక్ ఏరియాలో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది. కావున నీటి సరఫరా కానీ ఏరియా చేతి పంపులు, మోటార్ బోర్లను వినియోగించుకోవలన్నారు.


