అక్రమ మొరం తవ్వకాలపై సి సి ఎస్ మెరుపుదాడి – వాహనాలు స్వాధీనం : పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు సిి సి ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది అక్రమ మొరం తవ్వకాలపై మెరుపుదాడి నిర్వహించారు.
నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుగుట్ట వెనుక భాగంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న మూడు టిప్పర్లు, రెండు జెసిపిలు యంత్రాలు మరియు ఒక ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల కోసం నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ తవ్వకాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని పోలీస్ కమీషనర్
హెచ్చరించారు.


