పోతంగల్ . ఏప్రిల్ 12 జన సంఘర్షణ
పోతంగల్ గ్రామపంచాయతీ టక్టర్ ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించ వలిసిన వాటర్ ట్యాంకర్ ను గ్రామ పంచాయితీ సిబ్బంది ఇసుక క్వారీ పనులకు అప్పగించిన సంఘటన పోతంగల్ మండలం లో వెలుగు లోకి వచ్చింది.మంజీరా నదిలో ఇసుక తవ్వకాల అవసరాలకు పోతంగల్ గ్రామ పంచాయితీ వాటర్ ట్యాంకర్ అందజేశారు.వేసవి కాలంలో గ్రామాలలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అన్నివనరులను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ పదే పదే సూచనా లు చేస్తున్నా కార్యదర్శులు పెడ చెవిన పెడుతున్నారు. గ్రామ ప్రజల కోసం వినియోగించ వలిసిన ట్యాంకర్ ఇసుక క్వారీలో ఉంచడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత పది రోజుల నుంచి ట్యాంకర్ ట్రాక్టర్ ను ఇసుక కాంట్రాక్టర్లు కు అందు బాటులో ఉంచడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


