పోలీస్ అమరవీరల పిల్లల చదువుల ఫీజు కోసం చెక్కు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర డిజిపిఆర్థిక సహాయం అందించిన టెర్మినస్ గ్రూపు సీ.ఎం.డి ఎస్.పి రెడ్డి
బోధన్: ఏప్రిల్ 25 జన సంఘర్షణ
నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ 18న మరణించిన సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించిన టెర్మినస్ గ్రూప్ సీఎండీ ఎస్పీ రెడ్డి ఉదారత ప్రశంసనీయమైంది. శనివారం రోజున డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, ఐపిఎస్ చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ పిల్లల ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు కోసం చెక్కును అందజేశారు. ఎస్పీ రెడ్డి తండ్రి ఎస్.ఎల్.ఎన్ రెడ్డి బోధన్ పట్టణంలో డీఎస్పీగా సేవలు అందించారు. ప్రమోద్ కుటుంబానికి సహాయం చేయాలని సంప్రదించగానే, ఎస్పీ రెడ్డి వెంటనే స్పందించి సహకరించడం ఆయన మనసు గొప్పతనాన్ని చూపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరచిపోమని , వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


