అతికీలకం డి జి పి సి వి ఆనంద్
హైదరాబాద్ సిటిబ్యూరో / మే 13
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డిజిపి సీ వి ఆనంద్ అన్నారు. బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ మీడియా డైరెక్టర్ ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి సీవీ ఆనంద్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే మీడియా శక్తివంతమైనదని సమాజాభివృద్ధికి జర్నలిస్టులు కృషి చేయాలని అన్నారు. రాజకీయ, ఆర్థిక, విద్య, వైద్య, రాష్ట్ర సాంకేతిక రంగాల అభివృద్ధి మరింత దృష్టి సారించాలని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు వారధిగా ఉండాలని అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ అయినా జర్నలిజం వృత్తిని నమ్ముకుని పనిచేసే వారి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి చిలుకూరి అఖిలేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి, ప్రధాన కార్యదర్శి జూలూరు రమేష్, ఉపాధ్యక్షులు లక్కాకుల ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.


