Homeతెలంగాణకామారెడ్డితుజల్పూర్ శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు

తుజల్పూర్ శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

తుజల్పూర్ శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు

బీబీపేట్ , మే 12 జన సంఘర్షణ

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలో తుజాల్పూర్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామంలోని శ్రీ శివరామ మందిర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఆలయం నుండి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగగా కోలాటాల మధ్య కొనసాగింది. ఈ హనుమాన్ శోభాయాత్రను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, గ్రామ సర్పంచ్ ప్రవిత శ్రీనివాస్, హైందవ సేన కమిటీ అధ్యక్షులు ఆనంద్, గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మారెడ్డి, హైందవ సేవ కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular