Homeతెలంగాణనిజామాబాద్ఆర్మూర్ , మోర్తాడ్ లో అక్రమ ఇసుక రవాణాపై చీత ఫోర్స్ మెరుపు దాడులు 

ఆర్మూర్ , మోర్తాడ్ లో అక్రమ ఇసుక రవాణాపై చీత ఫోర్స్ మెరుపు దాడులు 

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ , మోర్తాడ్ లో అక్రమ ఇసుక రవాణాపై చీత ఫోర్స్ మెరుపు దాడులు

– రెండు భారీ లారీలు పట్టివేత పోలీస్ కమీషనర్ వెల్లడి.

బోధన్ మే 12 జన సంఘర్షణ

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మంగళవారం రోజున మేరకు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా , మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సి.సి.ఎస్ ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ సిబ్బంది నిత్యం ప్రత్యేక నిఘా నిర్వహిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.

నేడు మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధి మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీత ఫోర్స్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. రహస్య సమాచారం మేరకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇసుక లారీలను గుర్తించిన పోలీసులు వెంటనే వాటిని అడ్డుకుని తనిఖీ చేశారు. తనిఖీల్లో రెండు 14 టైర్ల భారీ వాహనాల్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, రవాణా పత్రాలు లేదా మైనింగ్ సంబంధిత డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే వాహనాలను స్వాధీనం చేసుకుని, డ్రైవర్లు మరియు సంబంధిత వ్యక్తుల వివరాలను నమోదు చేశారు. పట్టుబడిన లారీలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత మోర్తాడ్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లకు అప్పగించారు. కేసు నమోదు చేసి , ఇసుక ఎక్కడి నుండి తరలిస్తున్నారు , దీనికి సంబంధించి మరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా , నదీ పరివాహక ప్రాంతాలు దెబ్బతిని పర్యావరణ సమతుల్యతకు ముప్పు ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరగడం వల్ల భూగర్భ జలాల స్థాయి తగ్గిపోవడం , వ్యవసాయ భూములపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, జిల్లాలో అక్రమ మైనింగ్ మరియు ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళల్లో కూడా ప్రత్యేక బృందాలతో చెక్‌పోస్టులు , ప్రధాన రహదారులు మరియు గ్రామీణ మార్గాల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular