Homeక్రైమ్ న్యూస్బోధన్ పట్టణంలో గంజాయి నేరస్థుని అరెస్ట్

బోధన్ పట్టణంలో గంజాయి నేరస్థుని అరెస్ట్

📰 Generate e-Paper Clip

బోధన్ పట్టణంలో గంజాయి నేరస్థుని అరెస్ట్

బోధన్ మే 11 జన సంఘర్షణ

బోధన్ పట్టణంలోని పెంట బైపాస్ వద్ద సోమవారంరోజున మధ్యహ్నం సుమారు 01:60 గంటల సమయం నమ్మదగిన సమాచారం మేరకు బోధన్ పోలీస్ మరియు ఈగల్ RNCC టీం నిజామాబాద్ పూర్ణేశ్వర్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది తో కలిసి పెంట బై పాస్ రోడ్ దగ్గర వాహనముల తనిఖి చేస్తుండగా నలుపు ఎరుపు రంగు పల్సర్ మోటార్ సైకిల్ TS 16 FE 4972 పై ముద్దాయి రాగా అతడిని పట్టుకొని తనిఖీ చేయగా అతని దగ్గర గంజాయి మొత్తం బరువు 1.660 ఒక కిలో ఆరు వందల అరవై గ్రాములు కలదు, వ్యక్తిని విచారించగా తన పేరు మేదరి మెట్ల ధనుష్ తండ్రి మేదరి మెట్ల సతీష్ కుమార్ వయసు 20 సం కులం మున్నూరు కాపు వృత్తి:కులీ పని నివాసం అజమ్ గంజ్ బోధన్ ప్రస్తుత నివాసం ఆదర్శ నగర్ ఆర్మూర్ నిషేదిత గంజాయిని నాందేడ్ నుండి కొనుక్కొని వచ్చి ఇక్కడ యువకులకు, కూలి పని చేసే వారికి అముతున్నారు, అతడిని పట్టుకొని అతని వద్ద నుండి గంజాయి మరియు మోటార్ సైకిల్ TS 16 FE 4972, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నరు. హబీబ్ ఖాన్ ఎస్ ,ఐ,పి పిఎస్   బోధన్ టౌన్  వి. వెంకట నారాయణ ఎస్ హెచ్ ఓ బోధన్ టౌన్, హబీబ్ ఖాన్ ఎస్సై బోధన్, మరియు సిబ్బంది కే. మహేష్, ఎ. వరుణ్, లను మరియు ఈగల్ ఆర్,ఎన్, సి,సి టీం నిజామాబాద్ పూర్ణేశ్వర్ ఇన్స్పెక్టర్ సిబ్బంది ని కమిషనర్ అభినందించారు. బోధన్ లో ఎవరైనా నిషేదిత గంజాయిని కొనడం, అమ్మడం లేదా సేవించడం వంటివి చేసే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోనబడతాయి, మాదక ద్రవ్యాల నివారణకు ఉక్కుపాదం మోపబడును, ఎవరయినా గంజాయిని కొనడం, అమ్మడం లేదా సేవించడం వంటి చర్యలకు పాల్పడితే 1908 కి లేదా వాట్అప్ నేం, 87126 71111 కి సమాచారము ఇవ్వగలరు. సమాచారము తెలిపిన వారి వివరములు గోప్యము గా ఉంచబడునని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular