♦ కేటీఆర్‌ను కలిసిన చేల్పూర్ వార్డ్ మెంబర్ కొండి కుమార్ స్వామి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
♦ రేపాక గ్రామంలో కేటీఆర్‌తో రైతాంగ సమస్యలపై చర్చించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
♦ రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

రేగొండ మండలం రేపాక గ్రామానికి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) విచ్చేశారు. కేటీఆర్ రేపాక విలేజీకి వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ స్థానిక నాయకత్వం ఆయనను కలిసేందుకు తరలివెళ్లింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో వార్డ్ మెంబర్‌గా గెలిచిన బిఆర్ఎస్ నాయకుడు కొండి కుమార్ స్వామి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ భేటీ సందర్భంగా రేగొండ మండలం, చేల్పూర్ పరిసర ప్రాంతాల్లోని రైతులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను కొండి కుమార్ స్వామి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కలిసి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. రైతాంగానికి అందుతున్న సాయం, క్షేత్రస్థాయి ఇబ్బందులను వివరించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్థానిక ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను, క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని కొండి కుమార్ స్వామి ఈ సందర్భంగా కేటీఆర్‌కు పూసగుచ్చినట్లు వివరించి, పార్టీ పరంగా లభించాల్సిన మద్దతును కోరారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో తప్పనిసరిగా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం మండలంలోని కార్యకర్తలు, నాయకులు అంతా కలిసికట్టుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌కు తెలిపారు.
కొండి కుమార్ స్వామి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు కార్యకర్తలు అందించిన వివరాలపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు అండగా ఉంటామని పేర్కొంటూ, వచ్చే ఎన్నికల్లో వచ్చేది మన ప్రభుత్వమేనని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ,కొండి కుమార్ స్వామి మరియు ఇతర నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


