HomeYellanduఘనంగా గాయత్రీ పరివార్ శతాబ్ది ఉత్సవాలు

ఘనంగా గాయత్రీ పరివార్ శతాబ్ది ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

మాస్టర్ మైండ్స్ హైస్కూల్‌కు ప్రతిష్టాత్మక “జన్మ శతాబ్ది అవార్డు” ప్రదానం

♦ విలువలతో కూడిన విద్యకే అగ్రతాంబూలం: డా. సతీష్ ఖండేల్వాల్ ప్రశంసలు

అఖిల విశ్వ గాయత్రీ పరివార్ కేంద్రం (శాంతికుంజ్ – హరిద్వార్) సంస్థాపకులు వేదమూర్తి పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారి సాధన శతాబ్ది, అఖండ దీపజ్యోతి శతాబ్ది సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా వందనీయ మాతాజీ జన్మ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని, గాయత్రీ పరివార్ యగ్ నిర్మాణ్ మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు మాస్టర్ మైండ్స్ హైస్కూల్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ విశేష కార్యక్రమానికి గాయత్రీ పరివార్ యగ్ నిర్మాణ్ మిషన్ జిల్లా సమన్వయకర్త, ప్రముఖ సంఘసంస్కర్త డా. సతీష్ ఖండేల్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

సమాజంలో విద్యార్థులకు నాణ్యమైన, సంస్కారవంతమైన విద్యను అందిస్తున్నందుకు గాను మాస్టర్ మైండ్ హైస్కూల్ కరస్పాండెంట్ గౌరవనీయులు సర్వేశ్వరరావు గారికి డా. సతీష్ ఖండేల్వాల్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక “జన్మ శతాబ్ది అవార్డు” ను అందజేశారు.

ఈ సందర్భంగా డా. సతీష్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. పూజ్య గురుదేవులు, వందనీయ మాతాజీ స్ఫూర్తితో సమాజంలో విలువలతో కూడిన విద్యను, సంస్కారాన్ని వ్యాప్తి చేయడంలో మాస్టర్ మైండ్ స్కూల్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.

విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, సద్బుద్ధి, సదాలోచన, గాయత్రీ మంత్ర సాధన, దేశభక్తి మరియు నిజాయితీని తమ జీవితంలో అలవరచుకోవాలని డా. సతీష్ ఖండేల్వాల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఉపాధ్యాయులు సమాజానికి దీపస్తంభాల లాంటి వారని, “మనం మారితేనే దేశం మారుతుంది” అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. అలాగే “నషా ముక్త భారత్ అభియాన్” లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జిల్లాను మాదకద్రవ్యాలు లేని ప్రాంతంగా మార్చాలని డా. సతీష్ ఖండేల్వాల్ కోరారు.

ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో ఇన్ఫాక్ట్ క్లబ్ ట్రైనర్ ముతైబోయిన శ్రీనివాసరావుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, సిబ్బంది, విద్యార్థులు మరియు గాయత్రీ పరివార్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular