Homeమహబూబాబాద్రేపు మహబూబాబాద్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు మహబూబాబాద్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్ పట్టణంలోని 5వ ఫీడర్ పరిధిలో 11 కేవీ విద్యుత్ లైన్ నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ సంగీత తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 9 (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత నంది నగర్, గుండ్లకుంట, స్థూపం, ఆర్‌టీసీ కాలనీ, గిరిప్రసాద్ నగర్, ఎల్‌బీజీ నగర్, రాహుల్ నగర్, కంకర్ మిల్ తండా, చిట్యాల గోపయ్య నగర్, ఎట్టిగడ్డ తండా, సిద్ధార్థ క్యారీ పాయింట్, రామచంద్రపురం కాలనీ, ఆర్‌టీసీ బస్టాండ్ రోడ్, బతుకమ్మ విగ్రహం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, స్నేహ నగర్, ఆకుల లక్ష్మయ్య కాలనీ, అంబేద్కర్ కాలనీ, ఎదులపూసపల్లి రోడ్ తదితర ప్రాంతాలు.నిర్వహణ పనుల దృష్ట్యా ఆయా ప్రాంతాల ప్రజలు విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ సంగీత కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular