Homeతెలంగాణహైదరాబాద్రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్....

రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు

📰 Generate e-Paper Clip

కార్ఖానా బాధితులకు తుంకుంట తరహాలోనే 10 రెట్ల పరిహారం అందించాలి  

 ♦ సీఎంకి లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు  

♦ మార్కెట్ విలువ ప్రకారం భూసేకరణ పరిహారాన్ని పునఃసమీక్షించాలి  

♦ ప్రాజెక్ట్ పురోగతికి బాధితుల సహకారం.. ప్రభుత్వం నుండి న్యాయమైన పరిహారం అవసరం  

సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానా ప్రాంతంలో రాజీవ్ రహదారిపై ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్న బాధితులకు తగిన రీతిలో పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి గురువారం ఒక అధికారిక లేఖ రాశారు.

రాజీవ్ రహదారి వెడల్పు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు స్థానిక ప్రజలు, వ్యాపారులు ఎంతో సహకరిస్తున్నారని ఎన్. రామచంద్రరావు తమ లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధికై వారు ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించకుండా పూర్తి సహకారం అందిస్తున్నారని వివరించారు.

ప్రాజెక్టుల నిర్మాణం కోసం తమ ఇళ్లను, జీవనోపాధిగా ఉన్న వ్యాపార సముదాయాలను వదులుకుంటూ కార్ఖానా ప్రజలు పెద్ద త్యాగం చేస్తున్నారని రామచంద్రరావు గుర్తుచేశారు. ఇలాంటి బాధితులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం మార్కెట్ విలువకు తగినట్లుగా, న్యాయబద్ధంగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు.

తుంకుంట పరిధిలో ఇదే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టినప్పుడు, అక్కడ బాధితులకు ఆస్తి అసలు విలువకు దాదాపు 10 రెట్లు ఎక్కువగా పరిహారం అందించారని ఎన్. రామచంద్రరావు వెల్లడించారు.

అదే రీతిలో కార్ఖానా ప్రాంతంలోని బాధిత కుటుంబాలకు కూడా తుంకుంట తరహాలోనే ఆస్తి విలువకు 10 రెట్ల నష్టపరిహారాన్ని పెంచి అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన న్యాయం అందించాలని సూచించారు.

కార్ఖానాలో ప్రభావితమవుతున్న ప్రతీ ఆస్తిని విడివిడిగా పునఃసమీక్షించాలని, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న నడుస్తున్న ధరలను ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆస్తుల స్వాధనం చేసుకునే ముందే రీ-అసెస్మెంట్ పూర్తి చేయాలన్నారు.

పరిహారం పెంపుపై స్థానిక బాధిత ప్రజలతో నేరుగా చర్చలు జరిపి, వారి ఆమోదంతో నష్టపరిహార ప్యాకేజీని ఖరారు చేయాలని, స్వాధీనానికి ముందే ఆ మొత్తాన్ని చెల్లించాలని రామచంద్రరావు స్పష్టం చేశారు.

బాధితులకు తగిన న్యాయం జరిగితేనే రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సుఫీసంగా, వేగంగా పూర్తవుతాయని ఎన్. రామచంద్రరావు తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular