Homeతెలంగాణకూకట్పల్లి ప్రెస్ క్లబ్ (TWJF) ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు 

కూకట్పల్లి ప్రెస్ క్లబ్ (TWJF) ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు 

📰 Generate e-Paper Clip

— నిర్వహించిన TWJF కూకట్‌పల్లి అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు.

 

 

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 19, (జన సంఘర్షణ):

శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్‌ కాలనీలో కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. TWJF కూకట్‌పల్లి అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను, సమాజంలోని వాస్తవ పరిస్థితులను తమ కెమెరా కళ్లతో ప్రపంచానికి పరిచయం చేస్తూ జర్నలిజంలో విశేష సేవలందిస్తున్న నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్, ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ మాచర్ల నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎర్ర యాకయ్య మాట్లాడుతూ “ఒక చిత్రం కోట్ల మాటలు మాట్లాడుతుంది, వేల ప్రశ్నలను సంధిస్తుంది. లక్షల సమాధానాలకు సమానంగా నిలుస్తుంది” అని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలు సమాజానికి విలువైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పుట్టి నగేష్, TWJF కమిటీ సభ్యులు సుజాత, సభ్యులు అనిల్ కిషోర్,శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular