Homeఎడిటోరియల్దృశ్య బందనం

దృశ్య బందనం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ సిటీ ప్రతినిధి అంజిబాబు నాగుల,ఆగస్టు 18, (జన సంఘర్షణ):

కాలాన్ని నిలిపే అద్భుతం

రెప్పపాటులో క్షణాన్ని,శాశ్వతంగా బంధించే మాయాజాలం

కంటికి కనిపించే రూపాల వెనుక

కనిపించని జ్ఞాపకాలనిధి

 

భాషతో పనిలేని భావచిత్రం

మాటలు రాని మౌన గీతం

 

ప్రతి క్షణాన్ని కావ్యంగా మలిచే సృజనశీలి ప్రతిచిత్రం

అక్షర రహిత దృశ్య కావ్యం ప్రతిచిత్రం… ఎంత విచిత్రం

 

నవ్వులు… కన్నీళ్ళు..

ఆనందాలు విషాదాలు

బోసి నవ్వులు

ముదిమి ముసుర్లు

ప్రకృతి పరువాలు ప్రళయాలూ…ఒకటేమిటి

చిత్రబందం లో బందింపబడిన దృశ్య బందన చిత్రాలెన్నో.. ఎన్నెన్నో…

 

ఒక్క క్లిక్‌తో ప్రపంచాన్ని చుట్టేసి

మనసు మూలల్లోని భావాలను తట్టి లేపి

నిన్నటి నిజాలను నేటికీ సజీవంగా ఉంచే

ఛాయాచిత్ర కళకు వందనం!

 

(ప్రపంచ పోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు!)

—కొండూరి. కోటిబాబు, హైకోర్టు అడ్వకేట్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular