* బి ఆర్ ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, సెప్టెంబర్ 05(జనసంఘర్షణ):
తెలంగాణ రాష్ట్రము లో అధికారం లోకి వచ్చి 1000 అవుతున్న ఇంక 6 గ్యారంటీలు అమలు చేయకుండా 420 హామీలు ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్న అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా, చర్ల పట్టణంలో పలు వార్డు లలో ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డు లను పంపిణీ చేసిన బి ఆర్ ఎస్ పార్టీ చర్ల మండల కమిటీ నాయకులు ఈసందర్భంగా కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి 1000 రోజులు అవుతున్న కనీసం హామీలు అమలుచేయడం లేదు అని పాలన చేతకాక ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలి అని మాట్లాడుతున్నారు, అసలు రాజీనామా చేయాల్సింది మీరు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుకు ముందు మీరు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ యువజన విభాగం నాయకులు కాకి అనిల్, అంబోజి సతీష్, గోరింట్ల వెంకటేశ్వరరావు, వార్డ్ మెంబర్ కట్టం కన్నరావు, గదేంశెట్టి కిశోర్, తడికల బుల్లేబాయ్,పసికంటి సంతోష్, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.


