Homeతెలంగాణభీమ్ ఆర్మీలో పదవుల వివాదం!

భీమ్ ఆర్మీలో పదవుల వివాదం!

📰 Generate e-Paper Clip

 

!

 

మాదిగ వర్గానికి అన్యాయం చేస్తున్నారంటూ జిల్లా అధ్యక్షుడు రవి ఆరోపణలు

 

నిజామాబాద్,/ సెప్టెంబర్ 15/ (జనసంఘర్షణ): భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న తనకు ఎలాంటి సమాచారం, షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే అజయ్ అనే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారని రవి గడ్డెం గుండారం ఆరోపించారు. సుమారు ఆరు నెలలుగా తాను జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని తెలిపారు.

 

సంస్థలో మాదిగ వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రశ్నించినందుకే తనపై కొందరు గొడవలకు దిగడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ కన్వీనర్‌గా ఉన్న సిద్ధూ రావణ్‌కు జిల్లా అధ్యక్షుడిని తొలగించే అధికారం ఉందా? ఉంటే సంస్థ నిబంధనలు ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

 

భీమ్ ఆర్మీలో మాల–మాదిగ వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకోవడం బాధాకరమని, దళితుల ఐక్యత కోసం పనిచేయాల్సిన సంస్థలో కుల వివక్షకు తావు ఉండకూడదన్నారు. ఈ వ్యవహారంపై ఐ కమాండ్‌కు కూడా ఫిర్యాదు చేశామని, తమకు ఈ విషయం గురించి సమాచారం లేదని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, అధైర్యపడవద్దని ఐ కమాండ్ భరోసా ఇచ్చినట్లు రవి తెలిపారు.

 

తన తొలగింపునకు కారణాలు, కొత్త జిల్లా అధ్యక్షుడి నియామకం, సంస్థలో పదవుల నియామకం–తొలగింపునకు సంబంధించిన నిబంధనలపై భీమ్ ఆర్మీ నాయకత్వం బహిరంగంగా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular