
— ముఖ్యఅతిథిగా హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 03, (జన సంఘర్షణ):
అక్టోబర్ 03, 2026 సంవత్సరం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నాంపల్లి ప్రాంగణం హైద్రాబాద్ లో జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ సభ కార్యక్రమంకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ నేపథ్యంలో చిత్రలేఖన విభాగంలో ఎంపికైన కూరెళ్ళ శ్రీనివాస్ ని రూ. 30,116/- ల పారితోషికంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన కవులు కళాకారులను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలోని 12 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వెలుదండ నిత్యానంద రావు అధ్యక్షత వహించారు. నల్లగొండకు చెందిన కూరెళ్ల శ్రీనివాస్, (విశ్రాంత ప్రధానోపాధ్యాయులు) చిత్రకళా రంగంలో చేసిన సేవలకు గాను ఈ పురస్కారం వరించింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు మరియు అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు, వయోజన విద్య కార్యక్రమాలకు గీసిన చిత్రాలకు,పాఠశాలలో చేసిన కృషికి గాను ప్రతిభా పురస్కారం అందుకున్నారు.


