Homeఎడిటోరియల్*KCC క్రికెట్ టోర్నమెంట్ సీజన్–5 విజేతలకు బహుమతుల ప్రదానం

*KCC క్రికెట్ టోర్నమెంట్ సీజన్–5 విజేతలకు బహుమతుల ప్రదానం

📰 Generate e-Paper Clip

 

*యువత క్రీడల్లో రాణించాలి.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: యువ నాయకుడు పబ్బ శేఖర్!!*

కోటగిరి/అక్టోబర్ 4/(జన సంఘర్షణ)

KCC క్రికెట్ టోర్నమెంట్ సీజన్–5 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తుది పోరులో విజేతగా నిలిచిన జట్టుకు యువ డైనమిక్ నాయకుడు పబ్బ శేఖర్ చేతుల మీదుగా విజేత బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విజేత జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు.

*ఈ సందర్భంగా పబ్బ శేఖర్ మాట్లాడుతూ.!!!!*. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని, తమలోని ప్రతిభను వెలికితీసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఐకమత్యం పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

*చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి..!!!*

యువత ముఖ్యంగా గుట్కా, గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పబ్బ శేఖర్ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని, విద్య, క్రీడలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో ముందుకు సాగాలని కోరారు.

*తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలి*

ప్రతి యువకుడు తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల పేరును నిలబెట్టడంతో పాటు, మన ఊరు, మన జిల్లా పేరును కూడా నిలబెట్టాలని సభాముఖంగా పబ్బ శేఖర్ కోరారు. యువత మంచి మార్గంలో నడుస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

*క్రీడల ద్వారా యువతలో ప్రతిభను..* ప్రోత్సహించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ, KCC క్రికెట్ టోర్నమెంట్ సీజన్–5 విజేత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular