HomeKotagiriరైతే రాజు.. రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది.

రైతే రాజు.. రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది.

📰 Generate e-Paper Clip

 

*కొత్తపల్లి పీఏసీఎస్‌లో వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. రైతులకు మెరుగైన ధర రావాలి: డాక్టర్‌ సునీల్‌కుమార్‌ చౌదరి!!!!*

 

నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాల బ్యూరో అక్టోబర్‌ 5 (జన సంఘర్షణ): రైతు కష్టాన్ని దగ్గరగా చూసినవారికే రైతు బాధ తెలుస్తుందని, రైతుకు తన పంటకు సరైన ధర లభించినప్పుడే ఆ కుటుంబంలో నిజమైన సంతోషం కనిపిస్తుందని కొత్తపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ వెనిగళ్ల సునీల్‌కుమార్‌ చౌదరి అన్నారు. “రైతే రాజు.. రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది” అనే ఆలోచనతో రైతుల ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) హెడ్‌క్వార్టర్స్‌ వద్ద 2026 వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ వెనిగళ్ల సునీల్‌కుమార్‌ చౌదరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, ముఖ్య అతిథిగా కోటగిరి మండల తహసీల్దార్‌ కె. గంగాధర్‌ హాజరయ్యారు.

*రైతు కష్టం తెలిసినవారికే రైతు బాధ తెలుస్తుంది…..!!!!*

ఈ సందర్భంగా డాక్టర్‌ సునీల్‌కుమార్‌ చౌదరి మాట్లాడుతూ తాను కూడా గతంలో రైతుగా ఉన్నానని, రైతు పొలంలో పడే చెమట, పంట కోసం చేసే శ్రమ, పంట చేతికి వచ్చే వరకు ఎదుర్కొనే కష్టాలు తనకు తెలుసన్నారు. “రైతు కష్టకాలంలో పడే కష్టం ఏంటో రైతుగా ఉన్న నాకు తెలుసు. అందుకే రైతుకు ధాన్యానికి మంచి ధర రావాలన్నదే నా ఆకాంక్ష” అని అన్నారు.

ప్రస్తుతం వరి ధాన్యానికి వస్తున్న ధరలను చూస్తుంటే సంతోషంగా ఉందని, తాను రైతుగా ఉన్న కాలంలో ఇంత మంచి ధరను ప్రతి సందర్భంలో చూడలేదని ఆయన పేర్కొన్నారు. రైతు పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చినప్పుడు ఆ ఆనందం కేవలం రైతు కుటుంబానికే పరిమితం కాకుండా మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపారు.

*రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలి..!!!!*

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని, రైతులకు బోనస్‌ కూడా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే రైతుకు పంట పండించేందుకు అయ్యే ఖర్చులు, శ్రమ, ప్రకృతి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యానికి మరింత మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

దొడ్డు వడ్ల నుంచి సన్న వడ్ల వరకు రైతులకు కనీసం రూ.4,500 నుంచి రూ.5,000 వరకు అధికారిక మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ అంశంపై పీఏసీఎస్‌ జనరల్‌ బాడీతో పాటు ఇతర సమావేశాల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించనున్నట్లు చెప్పారు.

*ధర ఉంటే రైతుకు ధైర్యం…..!!!!*

ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన మద్దతు ధర ప్రకటిస్తే రైతుకు తన ధాన్యాన్ని విక్రయించే విషయంలో భరోసా ఏర్పడుతుందని సునీల్‌కుమార్‌ చౌదరి అన్నారు. ప్రభుత్వ మద్దతు ధరతో పాటు ప్రైవేటు వ్యాపారుల మధ్య కూడా పోటీ ఏర్పడి రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని వివరించారు.

*“రైతు పండించిన పంటకు సరైన ప్రతిఫలం దక్కాలి….!!!!*. రైతు నష్టపోతే దాని ప్రభావం కుటుంబంపైనే కాదు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామం సంతోషంగా ఉంటుంది” అని ఆయన అన్నారు.

*రైతులు తమ ధాన్యాన్ని విక్రయించే ముందు…..!!!!* నాణ్యత, తేమ శాతం, మార్కెట్‌లో లభిస్తున్న ధరలను పరిశీలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పీఏసీఎస్‌ ద్వారా అందుబాటులో ఉన్న సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

*రైతే రాజు….!!!!!!* అనే మాట కేవలం నినాదంగా కాకుండా ఆచరణలో కనిపించాలి. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం అందినప్పుడే ఆ మాటకు నిజమైన అర్థం వస్తుంది అని డాక్టర్‌ సునీల్‌కుమార్‌ చౌదరి పేర్కొన్నారు.

*పలువురు ప్రజాప్రతినిధులు హాజరు….*

కార్యక్రమంలో సర్పంచులు పి. గంగాధర్‌, కోర్ర రవి, వెల్లంకి సీతాకుమారి రంగదాస్‌ చౌదరి, శ్యామ్‌కీ శంకర్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు వల్లేపల్లి శ్రీనివాసరావు, గుగులోతు తుకారాం, మండల వ్యవసాయ అధికారి రాజు, ఏఈఓలు రాంపూర్‌ షేక్‌ గౌస్‌, కొత్తపల్లి ప్రశాంత్‌, సీఈఓ కమలేష్‌, సుదర్శన్‌, రైతులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular