Homeతెలంగాణ*పేకాటరాయుళ్ల అరెస్టు.. పేకాట స్థావరంలో ఓ రిపోర్టర్?

*పేకాటరాయుళ్ల అరెస్టు.. పేకాట స్థావరంలో ఓ రిపోర్టర్?

📰 Generate e-Paper Clip

బీర్కూర్‌లో పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్టు

రూ.14,200 నగదు స్వాధీనం.. రిపోర్టర్‌ ఉన్నారనే ఆరోపణలపై చర్చ

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బ్యూరో/, అక్టోబర్ 8:/(జన సంఘర్షణ)

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో పేకాట జోరుగా సాగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు బీర్కూర్‌లో నిర్వహించిన దాడిలో ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. వారి వద్ద నుంచి రూ.14,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

అయితే పేకాట కొనసాగుతున్న స్థలంలో ఓ రిపోర్టర్ కూడా ఉన్నాడని, పోలీసుల దాడి సమయంలో అతన్ని పక్కకు తప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ప్రస్తుతం బీర్కూర్ మండలంలో చర్చనీయాంశంగా మారింది.

అయితే రిపోర్టర్‌ అక్కడ ఉన్నారా? లేదా అన్న అంశంపై అధికారికంగా పోలీసులు ఎలాంటి ధ్రువీకరణ చేయాల్సి ఉంది. దీంతో ఈ వ్యవహారంపై స్పష్టత రావాల్సి ఉంది.

*పేకాట స్థావరాలపై నిఘా పెంచాలి…!!*

బీర్కూర్ మండలంలోని పలు ప్రాంతాల్లో పేకాట స్థావరాలు కొనసాగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పేకాట నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేకాట కారణంగా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున ఇలాంటి కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular