Homeతెలంగాణహైదరాబాద్దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బండి రమేష్ 

దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బండి రమేష్ 

📰 Generate e-Paper Clip

దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బండి రమేష్ 

–ఖైతలాపూర్ దుర్గమ్మ తల్లి ఆలయం, చిత్తరామ టెంపుల్, బేగంపేట్‌లో ప్రత్యేక పూజలు.

 

హైదరాబాద్ సిటీ, కూకట్పల్లి ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 17, (జన సంఘర్షణ):

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్,కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ వివిధ ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైతలాపూర్‌లోని దుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రకాష్ ముదిరాజ్ ఆహ్వానం మేరకు, చిత్తరామ టెంపుల్‌లో తూము వేణు ఆహ్వానం మేరకు, అలాగే బేగంపేట్‌లో రమేష్ ఆహ్వానం మేరకు నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలకు బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని బండి రమేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular