Homeతెలంగాణహైదరాబాద్జోస్ అలుక్కాస్ 13వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బండి రమేష్.

జోస్ అలుక్కాస్ 13వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బండి రమేష్.

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్ సిటీ,కూకట్‌పల్లి ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 17,(జన సంఘర్షణ):

జోస్ అలుక్కాస్ 13వ వార్షికోత్సవం సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ జోస్ అలుక్కాస్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, జోస్ అలుక్కాస్ సంస్థ మరిన్ని విజయాలు సాధిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 13 సంవత్సరాలుగా ప్రజల ఆదరణ పొందుతూ ముందుకు సాగుతున్న సంస్థ మరెన్నో విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో *అరవింద్ రెడ్డి, రాజేష్ గౌడ్, రంగమోహన్, నలినీకాంత్, బొచ్చు మళ్లీ రమణ, లక్ష్మణ్ గౌడ్, జీసస్ మేనేజర్, పిడికిల్ గోపాల్ చౌదరి, కళ్యాణ్, రవి తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular