Homeతెలంగాణహైదరాబాద్పార్టీ బలోపేతమే లక్ష్యంగా కూకట్‌పల్లి కాంగ్రెస్ జేఏసీ కార్యాచరణ

పార్టీ బలోపేతమే లక్ష్యంగా కూకట్‌పల్లి కాంగ్రెస్ జేఏసీ కార్యాచరణ

📰 Generate e-Paper Clip

–ఐక్యంగా పనిచేయాలని సీనియర్ నాయకుల నిర్ణయం.

 

 

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు,నవంబర్ 12,(జన సంఘర్షణ):

కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జేఏసీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అట్టడుగు వర్గాల వరకు చేరేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు సంకల్పించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ఐక్యతతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాధు ప్రతాప్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు పట్లోళ్ల నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంజీవరావు, సీనియర్ నాయకులు సీహెచ్ కొండల్ రెడ్డి, కార్పొరేటర్‌గా పోటీ చేసిన విట్టల్ రెడ్డి, అబ్దుల్ బాకీ, మాజీ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, కృష్ణ రాజ్‌పుత్, రాజశేఖర్ రెడ్డి, సుంకన్న, గోవింద్ గౌడ్, ఎస్సీ సెల్ రాము, మైనారిటీ సెల్ చోటా మొయిజ్, షేక్, నాగేశ్వరరావు, నరేష్, వెంకటేష్ యాదవ్, మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular